ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ నిరసన తెలుపుతున్న రాజధాని గ్రామాల రైతులపై కేసులు పెట్టి పోలీసులు బేడీలు వేయడంపై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. రైతులకు బేడీలు వేయడాన్ని టీడీపీ పార్టీల నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. అయితే తాజాగా నేడు కృష్ణాయపాలెంలో రైతు కుటుంబాలను పరామర్శించిన నారా లోకేశ్ జగన్ సర్కార్‌పై సీరియస్ కామెంట్స్ చేశారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం భూమి త్యాగం చేసిన రైతులకు బేడీలు వేస్తే రాష్ట్రాన్ని దోచిన జగన్ రెడ్డిని ఇనుప గోలుసులతో తీసుకెళ్లాలని అన్నారు. ఎస్సిలపై ‘ఎస్సి, ఎస్టీ’ అట్రాసిటీ కేసు పెట్టడమే రాజారెడ్డి రాజ్యాంగం. అత్యుత్సాహంతో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న కొంతమంది అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని, రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకొని, వెంటనే విడుదల చెయ్యాలని కృష్ణాయపాలెంలో రైతు కుటుంబాలను పరామర్శించి వారికి, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చానని లోకేశ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం భూమి త్యాగం చేసిన రైతులకు బేడీలు వేస్తే రాష్ట్రాన్ని దోచిన జగన్ రెడ్డిని ఇనుప గోలుసులతో తీసుకెళ్లాలి. ఎస్సిల పై 'ఎస్సి,ఎస్టీ' అట్రాసిటీ కేసు పెట్టడమే రాజారెడ్డి రాజ్యాంగం. అత్యుత్సాహంతో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న..(1/2) pic.twitter.com/3BIKPgcsE1
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) October 28, 2020