నాని సరసన నజ్రియా…కొత్త సినిమా కి గ్రీన్ సిగ్నల్!

Friday, November 13th, 2020, 12:16:00 PM IST

తన నటనతో అందరినీ అలరించే న్యాచురల్ స్టార్ నాని మరొక భిన్నమైన కాన్సెప్ట్ కి ఓకే చెప్పారు. అయితే నాని సరసన మొదటి సారిగా నజ్రియా నటించనుంది. అయితే నజ్రియా కి తెలుగు లో కూడా ఇదే తొలి చిత్రం అని చెప్పాలి. ఈ మేరకు మైత్రి మూవీ మేకర్స్ వారు నజ్రియా ఫహడ్ కి వెల్కమ్ చెప్పారు. అయితే నాని సరసన హీరోయిన్ గా నజ్రియా ఓకే అవ్వడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నెల 21 న ఈ చిత్రం టైటిల్ ను రీవీల్ చేయనున్నారు చిత్ర యూనిట్.

నాని మరియు నజ్రియా కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి వివేక ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే అప్పటి వరకు దీవాలి శుభాకాంక్షలు అంటూ చిత్ర యూనిట్ విషెస్ తెలిపారు. నాని వరుస సినిమాలు చేస్తూ అలరిస్తుండగా, ఇటీవల విడుదల అయిన వి చిత్రం కాస్త నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. నాని ప్రస్తుతం నాని28 కాకుండా మరొక చిత్రం ను కూడా లైన్ లో పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.