ఏంటి .. నాని ఇంకా వరంగల్ లోనే ఉన్నాడా ?

Wednesday, October 11th, 2017, 09:38:13 PM IST


నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఎం సి ఏ సినిమాలో నటిస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ గత కొన్ని రోజులుగా వరంగల్ లోనే జరుగుతుంది. నాని సరసన ఫిదా ఫేమ్ సాయి పల్లవి నటిస్తున్న ఈ సినిమా పై అప్పుడే ఆసక్తి రేపుతోంది. రెండు హ్యాట్రిక్ విజయాలను అందుకున్న నాని స్పీడ్ ఎక్కడ తగ్గడం లేదు. మరో వైపు మరో రెండు సినిమాలను క్యూ లో పెట్టిన నాని చాలా రోజులుగా నాని వరంగల్ లోనే ఉన్నాడు. తాజాగా ఈ షూటింగ్ లొకేషన్ స్టిల్ ను సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు. గత నెలరోజులుగా వరంగల్లో నాని హంగామా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉందని, నవంబర్ లో చిత్రాన్ని విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.