సీఎం జగన్ కి నంద్యాల తాగుబోతుల విన్నపం… విషయం!

Monday, March 15th, 2021, 01:20:53 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార పార్టీ వైసీపీ మునిసిపల్ ఎన్నికల్లో ఊహించని రీతిలో భారీ విజయాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే కౌంటింగ్ మొదటి నుండి కూడా వైసీపీ తన ఆధిపత్యాన్ని కనబరుస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కర్నూల్ జిల్లా నంద్యాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

నంద్యాల 29 వ మున్సిపాలిటీ వార్డ్ లో ఓట్ల లెక్కింపు జరిగేటప్పుడు బాక్సుల్లో కొన్ని స్లిప్పులు వచ్చాయి. అందులో నంద్యాల తాగుబోతుల విన్నపం విషయం అంటూ చెప్పుకొచ్చారు. గౌరవనీయులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అన్న గారికి తాగుబోతుల విన్నపం ఏమనగా,కొత్త బ్రాండ్స్ ను తొలగించి పాత బ్రాండ్స్ అమ్మవలేను అని వ్యాఖ్యానించారు. లేకపోతే మాయొక్క చివరి ఓటు కాగలవని విన్నవించుకుంటున్నాం అని అన్నారు. అంతేకాక విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు తో పాటుగా జై అమరావతి అంటూ పలు స్లిప్పులు సైతం దర్శనం ఇచ్చినట్లు తెలుస్తోంది.