“అఖండ” గా వస్తున్న నందమూరి బాలకృష్ణ!

Tuesday, April 13th, 2021, 01:27:39 PM IST

నందమూరి బాలకృష్ణ కథనాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం కి చిత్ర యూనిట్ టైటిల్ ఫిక్స్ చేసింది. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద తమ తడాఖా చూపించాయి. హ్యాట్రిక్ విజయం కోసం ఈ కాంబో ఇప్పుడు సన్నద్ధం అవుతుంది. ఉగాది పండుగ సందర్భంగా చిత్ర టైటిల్ ను అనౌన్స్ చేయడం జరిగింది. అఖండ అంటూ చిత్ర యూనిట్ టైటిల్ ను అనౌన్స్ చేయడం మాత్రమే కాకుండా, బాలకృష్ణ రెండవ గెటప్ ను కూడా రీవీల్ చేయడం జరిగింది. ఈ చిత్రం లో బాలకృష్ణ శివ భక్తుడి గా కనిపిస్తూ చెప్పిన డైలాగ్ మాస్ కే సరికొత్త నిర్వచనం లా ఉన్నాయి.

కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలు కూస్తే కపాలం పగిలిపొద్ది అంటూ ఒక పవర్ ఫుల్ డైలాగ్ తో విడుదల చేసిన వీడియో బిట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. బాలకృష్ణ సరసన హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా, మరోక హీరోయిన్ ఈ చిత్రం లో వైద్యురాలి పాత్రలో కనపడనుంది. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 28 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు.