అవసరమైతే సీఎం జగన్‌ని కలుస్తా.. బాలకృష్ణ సరికొత్త డిమాండ్..!

Friday, January 8th, 2021, 03:21:48 PM IST

సీఎం జగన్‌కు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సరికొత్త డిమాండ్ వినిపించారు. నేడు అనంతపురం జిల్లాలో పర్యటించిన బాలకృష్ణ రాష్ట్రంలో ప్రకృతి విపత్తులకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదని మండిపడ్డారు. పండించిన పంటలను దళారుల పాలు చేస్తుందని ఇకనైనా ప్రభుత్వ తీరు మార్చుకుని రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదే కాకుండా రాష్ట్రంలో ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్న ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఆలయాలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. హిందుపురంలో పేకాట, మట్కాను అధికార పార్టీ నేతలు ప్రోత్సహిస్తున్నారని, మాట వినని అధికారులను బదిలీ చేస్తున్నారని దీనిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. అయితే హిందుపురాన్ని జిల్లాగా ప్రకటించాలని, అవసరమైతే ఈ విషయంపై సీఎం జగన్‌ని కలుస్తానని బాలకృష్ణ డిమాండ్ చేశారు.