ప్రభుత్వ అరాచకాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు – టీడీపీ నేత

Friday, October 30th, 2020, 12:57:58 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇటీవల రైతులను అరెస్ట్ చేయడం మాత్రమే కాకుండా సంకెళ్లు కూడా వేయడం పట్ల తెలుగు దేశం పార్టీ నేతలు అధికార వైసీపీ పై వరుస విమర్శలు చేస్తున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లాలో ప్రభుత్వ వైఖరి నీ వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ మేరకు తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ తీరును ఎండగడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వ అరాచకాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అని అన్నారు. అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు వేయడం సిగ్గుమాలిన చర్య అని ఘాటు విమర్శలు చేశారు. అయితే అమరావతి ఉద్యమం ను అనిచివేయడానికి ప్రభుత్వమే పెయిడ్ ఆర్టిస్టులతో ఉద్యమానికి తెర తీసింది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇదేంటి అని ప్రశ్నించిన రైతుల పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు అని పేర్కొన్నారు. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతి లో ఎస్సీ ల పైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం దారుణం అంటూ మండిపడ్డారు. పోలీసులు రైతులను దసరా పండుగ రోజున కక్ష పూరితంగా వ్యవహరిస్తూ అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాల భూమిని ఇచ్చిన రైతుల చేతులకు బేడీలు వేసి అవమానిస్తారా అంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న అమరావతి రాజధాని గా కొనసాగించే వరకు ఈ పోరాటం ఆగదు అని తెలిపారు.