అఖిల్ విషయంలో నాగార్జున మౌనం అర్థంగీకారమా !

Monday, February 27th, 2017, 04:20:23 PM IST


ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో బాహుబలితో సమానంగా హాట్ టాపిక్ గా మారిన అంశం అఖిల్ పెళ్లి విషయం. గత కొన్ని రోజులుగా అఖిల్ వివాహం రద్దయిందనే వార్తలు వెల్లువలా ముంచెత్తుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్పి పెళ్లి క్యాన్సిల్ అయిందనే అంటున్నారు తప్ప ఒక్కరు కూడా అలాంటిదేమీ లేదని అనడంలేదు. దీంతో జనాలు చాలా మంది శ్రియా భోపాల్ తో అఖిల్ పెళ్లి క్యాన్సిల్ అనే విషయానికే ఫిక్సయిపోయారు. అధికారికంగా ప్రకటించలేదుకాని ఇదే నిజమని అంటున్నారు. ఇంత జరుగుతున్నా నాగార్జున, అఖిల్ నుండి మాత్రం ఎలాంటి స్పందనా లేదు.

బాగా ఆలోచిస్తే ఎప్పుడూ ట్విట్టర్లో యాక్టివ్ గా ఉంటూ గతంలో తన మీద వచ్చిన అసత్యపు అప్పుల తాలూకు వ్యాఖ్యలని అడ్డంగా ఖండించి తన నిజాయితీని, ఖచ్చితత్వాన్ని నిరూపించుకున్న నాగార్జున తన కుమారుడు అఖిల్ జీవితంపై వస్తున్న వార్తలు ఒకవేళ నిజంగా తప్పుడివే అయ్యుంటే ఇంకా ఖండించకుండా, క్లారిటీ ఇవ్వకుండా మౌనంగానే ఉన్నారు. ఆయన అర్థంగీకారాన్ని బట్టి ఈ వార్త నిజంగానే నిజమైనా అయ్యుంటుంది లేదా ఇరు కుటుంబాల మధ్య ఇంకా మధ్యస్థపు చర్చలు జరుగుతున్నాయని అనుకోవచ్చు.