తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారిపోతుంది–నాగం జనార్దన్ రెడ్డి

Wednesday, January 15th, 2020, 09:00:35 PM IST

మునిసిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఫై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే నదుల అనుసంధానం పేరుతొ కాంట్రాక్టర్ల వద్ద కోట్ల రూపాయలు కాజేస్తూ, తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీరని ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసారు. తాజాగా కేసీఆర్ మరియు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చర్చల వ్యవహారం ఫై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. కృష్ణ నది పరివాహక ప్రాంతంగా వున్న తెలంగాణ కు తక్కువ నీటి కేటాయింపులు ఏమిటని ప్రశ్నించారు. అయితే ఒక్కోరోజు కేసీఆర్ ఫై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ నేతలు ఈ విషయం లో మాత్రం కేసీఆర్ తీరును ఎండగడుతున్నారు.

మీడియా సమావేశంలో మాట్లాడిన నాగం జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు సీఎం జగన్ ల చర్చలో వచ్చిన అంశాల ఫై పలు ఆరోపణలు చేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు కాల్వల వెడల్పు కొరకు దాదాపు 23 వేల కోట్ల రూపాయల్ని కేటాయించిందని తెలియజేసారు. అదేగాని జరిగితే తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారిపోతుంది అని సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే నీటి పంపకాల ఫై సీఎం కేసీఆర్ కు కనీస అవగాహన లేదని విమర్శించారు. ఈ అంశం ఫై తక్షణమే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేసారు. అంతేకాకుండా ఈ విషయం లో కేసీఆర్ చర్యలని అడ్డుకొని మహబూబ్ నగర్ జిల్లా రైతాంగ ప్రయోజనాలని కాపాడుకుంటామని అన్నారు.