బిగ్ బ్రేకింగ్ : వైసీపీ ఏడేళ్లు అధికారంలో ఉంటుంది..నాగబాబు సంచలన ట్వీట్.!

Tuesday, January 14th, 2020, 06:59:33 AM IST

ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాము.ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఎన్నేళ్ళు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందో అర్ధం కాని పరిస్థితుల్లో ఉన్నా కానీ వైసీపీ నేతలు మాత్రం రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ఏమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు.అయితే అసలు వైసీపీ పార్టీ ఏకంగా అక్షరాల ఏడేళ్ల పాటు అధికారంలో ఉండడం ఖాయమని జనసేన పార్టీ అధినేత సోదరుడు మరియు ఆ పార్టీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి నాగబాబు అంటూ సంచలనం రేపారు.

“ఏ పి స్టేట్ కి ఏలిన నటి శని జరుగుతుంది.ఇది 7 సంవత్సరాలు ఉంటుంది.టీడీపీ హయం లో రైతుల ని మభ్యపెట్టి రాజధాని పేరుతో వాళ్ళ జీవితాల తో ఆడుకోవడం మొదలు లెట్టటం తో మొదలైనది.ఇది వైసీపీ ప్రభుతం తో ఏలిన నాటి శని పీక్స్ లోకి వచ్చింది.ఇంకో 7 ఇయర్స్ ఏ పి ప్రజలకి తప్పదేమో.ఏలిన నటి శని మొదలయ్యింది.ఏలిన నటి శని బిగినింగ్ లో గాని ఎండింగ్ లో గాని తన ప్రభావం ఉధృతంగా చూపిస్తుంది.పరిస్థితుల్ని చూస్తుంటే వైసీపీ హయాంలో పీక్స్ లో కి ప్రభావం చూపిస్తుంది అనిపిస్తుంది. నేను జాతకాలు నమ్మను గాని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది.శని అనుచరులు రెండు పార్టీల్లో చాలా సమర్ధవంతంగా పనిచేస్తున్నారు.” అంటూ జగన్ పరిపాలనపై సంచలన ట్వీట్ చేశారు.