“ఆ హక్కు నీకు లేదు” అంటున్న నాగబాబు.!

Sunday, August 9th, 2020, 04:10:25 PM IST

మెగా బ్రదర్ నాగబాబు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో జాయిన్ అయ్యిన తర్వాత నుంచి మరింత స్థాయిలో యాక్టివ్ గా ఉంటున్నారు. అలా సోషల్ మీడియాలో కూడా తన భావాలను ఎప్పటికప్పుడు నిక్కచ్చిగా నాగబాబు వ్యక్తపరుస్తుంటారు. అలాగే ఇతర పార్టీల నాయకులకు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తుంటారు.

అయితే సమాజం పట్ల మరియు ప్రజా వ్యవస్థ పట్ల కూడా ఒక్కో సారి చాలా ఆలోచింపజేసే అంశాలను కూడా నాగబాబు చెప్తుంటారు. అలా ఇప్పుడు మరో ఆసక్తికర ట్వీట్ ను చేసారు. “రాష్ట్రం లో అభివృద్ది లేదు, కష్టం వస్తే ప్రభుతం పట్టించుకోవడం లేదు, అవినీతి లో కూరుకుపోయిన ప్రభుత్వం, అని నిందించే హక్కు రెండు వేలు తీసుకుని ఓటు వేసిన నీకు లేదు….” అంటూ ఓటర్లను ఉద్దేశించి ఈ సంచలన ట్వీట్ పెట్టారు.