థు మనిషి.మనిషి జన్మ… నాగబాబు ఎమోషనల్ కామెంట్స్..!

Thursday, June 4th, 2020, 02:53:33 AM IST


కేరళ రాష్ట్రంలో కొందరు ఆకతాయిలు చేసిన పని సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. కడుపుతో ఉన్న ఓ ఆడఏనుగుకు తినే పండులో పేలుడు పదార్థాలు పెట్టి దాని చావుకు కారకులయ్యారు. అయితే ఈ ఉదంతంపై యావత్ ప్రజానీకమంతా మండిపడుతూ ఏనుగు మరణానికి కారకులైన వారిని తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆయితే దీనిపై స్పందించిన నాగబాబు కేరళ లో అనాస పండు లో పేలుడు పదార్ధాలను పెట్టి గర్భం తో ఉన్న ఒక ఆడ ఏనుగు కి తినిపించి ఆ ఏనుగు మరణానికి కారకులైన bastards కి ఉరిశిక్ష వెయ్యాలని, ఆ మూగజీవి నోట్లో పేలిన పేలుడు ని తట్టుకొని అక్కడనుంచి పరిగెత్తుకుంటూ దగ్గరలోనే ఉన్న ఒక వాటర్ బాడీ లో కొంచెం సేపు ఆ పెయిన్ ని భరించి నెమ్మదిగా ప్రాణం వదిలిందని, నోట్లో పేలిన తర్వాత కూడా ఆ ఏనుగు బాధ తో రోడ్ మీద పరిగెడుతున్నప్పుడు కూడా ఒక్క మనిషి కి కూడా harm చెయ్యలేదు. దానికి ఉన్న మంచితనం కూడా ఆ bastards కి లేదు. ఛ ఛ మనిషి జన్మ ఎత్తినందుకు సిగ్గుగా ఉంది.ఇలాంటి మానవ జాతికి లక్ష కారోన లాంటి జబ్బులొచ్చినా తప్పులేదు అంటూ థు మనిషి.మనిషి జన్మ… అని ఎమోషనల్ ట్వీట్ చేసాడు.