పార్టీలో డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేసిన నాగ చైతన్య, సమంత !

Monday, October 10th, 2016, 08:10:08 PM IST


టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఫుల్ హ్యాపీగా ఉంది. తన ప్రియుడు, కాబోయే భర్త తాజాగా నటించిన ‘ప్రేమమ్’ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రిలీజ్ రోజునే ట్విట్టర్లో తనకు ఎగరాలో, ఏడవాలో, నవ్వాలో తెలీడం లేదని అంట ఆనందంగా ఉందని చెప్పిన సమంత తాజాగా నాగ చైతన్యతో కలిసి ఓ ప్రైవేట్ పార్టీలో తెగ ఎంజాయ్ చేసింది.

దీనికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇందులో సమంత ఫుల్ జోష్ తో మ్యూజిక్ కు డాన్సులు వేస్తుంటే నాగ చైతన్య ఆమెను చూస్తూ అప్పుడప్పుడు చిన్న స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశాడు. సమంత మాత్రం చిన్న పిల్లలా పట్టరాని ఆనందంతో అలిసిపోయే దాకా డ్యాన్స్ చేసి కాస్త నీళ్లు తాగి మళ్ళీ డ్యాన్స్ మొదలు పెడుతూ, మధ్య మధ్యలో చైతన్యతో ముచ్చట్లు చెబుతూ ఫుల్ గా ఎంజాయ్ చేసింది.