ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన నాగ్ అశ్విన్

Wednesday, February 17th, 2021, 12:52:30 PM IST

బాహుబలి చిత్రం తో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ప్రభాస్ హీరో గా, మహానటి సినిమా తో తనదైన ప్రతిభ కనబరిచి గుర్తింపు పొందిన నాగ్ అశ్విన్ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం పట్ల ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ చిత్రం లో ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే మరియు లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి కి అప్డేట్స్ ఇస్తారని ఎంతో ఆసక్తి గా ఎదురు చూసిన ప్రభాస్ అభిమానులకు నిరాశే మిగిలింది.

అయితే జనవరి నెలలో లేదా ఫిబ్రవరి 26 న అప్డేట్స్ ఇస్తానని తెలిపిన నాగ్ అశ్విన్, ఇప్పుడు మాట మార్చేశారు. ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇందుకు అభిమానులందరికీ కూడా క్షమాపణలు చెప్పారు నాగ్ అశ్విన్. అప్డేట్స్ ఆధారంగా సోషల్ మీడియాలో ట్రెండ్ మరియు తదితర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిన అభిమానులు నాగ్ అశ్విన్ పోస్ట్ తో అంతా నిరాశ పరిచింది అని చెప్పాలి. అయితే భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ కథ గా వస్తోంది. ప్రభాస్ ఇప్పటికే రాధే శ్యామ్ మరియు ఆదిపురుష్ చిత్రాలు విడుదల కి కూడా సిద్దం చేస్తున్నారు. ప్రస్తుతం సలార్ చిత్రం లో నటిస్తూ బిజీ గా ఉన్నారు ప్రభాస్.