కిల్లర్ అప్డేట్ ఇస్తా అంటున్న నాగ్ అశ్విన్

Wednesday, October 7th, 2020, 03:00:44 PM IST

ప్రభాస్ వరుస సినిమాలతో అలరించేందుకు సిద్దం అయ్యారు. నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ ఇంకా మొదలు కూడా కాలేదు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ప్రభాస్ సరసన కథానాయికగా దీపికా పడుకొనే కన్ఫర్మ్ అయిన విషయాన్ని ఇప్పటికే వెల్లడించారు. అయితే తాజాగా నాగ్ అశ్విన్ మరొక ఆసక్తి కర పోస్ట్ చేశారు.

పుట్టిన రోజు చాలా సింపుల్ గా ఉండనుంది అని,ఈ కరోనా వైరస్ వలన సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అని, అయితే ఇంకా అన్ విషయాలు బయట పెట్ట దల్చుకొలేదు అని, కాకపోతే పుట్టిన రోజు కి ముందుగా కిల్లర్ అప్డేట్ ఒకటి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. అతి త్వరలో అది రివీల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్నా, ఈ చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి. పాన్ వరల్డ్ చిత్రం గా తెరెక్కుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందనున్న సంగతి తెలిసిందే.