పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి హామీ.. నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..!

Wednesday, January 27th, 2021, 03:56:33 PM IST

ఏపీ రాజకీయాల్లోకి చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? జనసేనలో చేరి తమ్ముడికి అండగా నిలబడబోతున్నారా? ప్రస్తుతం రాజకీయవర్గాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. నేడు జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్‌కు అండగా ఉంటానని చిరంజీవి హామీ ఇచ్చారని, పవన్ రాజకీయ ప్రస్థానంలో తాను ఉంటానని చిరంజీవి మాటిచ్చారని నాదెండ్ల చెప్పుకొచ్చారు.

అంతేకాదు పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి కారణం చిరంజీవేనని, రెండు మూడేళ్లు సినిమాలు చేసిన తర్వాత రాజకీయాలు చేసుకోవాలని పవన్‌కి చిరు సూచించారని నాదెండ్ల చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు, త్వరలో జరగనున్న తిరుపతి ఉపఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీల్లో ఉన్న మెగా అభిమానులను జనసేన వైపు తిప్పడానికి నాదెండ్ల మనోహర్ ఇలా మాట్లాడారా లేక నిజంగానే పవన్ కళ్యాణ్‌కి చిరంజీవి మద్ధతుగా నిలబడబోతున్నారా అనేది ఇప్పుడు చర్చాంశనీయమయ్యింది.