జన సేన, బీజేపీ ఉమ్మడి సీఎం అభ్యర్ధి పవన్ కల్యాణే – నాదెండ్ల మనోహర్

Tuesday, March 30th, 2021, 07:31:31 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జన సేన , బీజేపీ ల ఉమ్మడి సీఎం అభ్యర్ధి పవన్ కల్యాణే అంటూ జన సేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. అయితే తిరుపతి లోని పలువురు సభ్యత్వం తీసుకున్న జన సేన పార్టీ కార్యకర్తలకు ప్రమాద భీమా మరియు సభ్యత్వ కిట్ లను అందజేశారు నాదెండ్ల మనోహర్. ఈ మేరకు మీడియా ద్వారా మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే జనసేన, బీజేపీ సమన్వయ సమావేశం లో పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ధృవీకరించారు అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన మాటలను స్వాగతిస్తున్నామని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తెలుగు దేశం పార్టీ అంతరించిపోయింది అని అన్నారు. రానున్న రోజుల్లో జన సేన,బీజేపీ కలిసి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాయి అంటూ చెప్పుకొచ్చారు.

అయితే ఉప ఎన్నికలో ప్రచారం లో భాగం గా పవన్ కళ్యాణ్ రోడ్ షో వచ్చే వారం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే బీజేపీ కీలక నేతలు అటు పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తుండగా, జన సేన సైతం బీజేపీ వ్యాఖ్యలను సమర్డిస్తోంది.అయితే తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక నేపథ్యం లో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు పట్ల వైసీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.