ఎమ్మెల్యే రాపాక కి నో ఎంట్రీ ఫ్లెక్సీ పై స్పందించిన నాదెండ్ల మనోహర్

Tuesday, March 23rd, 2021, 07:32:32 AM IST

జన సేన పార్టీ నుండి ఎమ్మెల్యే గా గెలిచిన ఏకైక వ్యక్తి రాపాక వరప్రసాదరావు. అయితే రాపాక వరప్రసాదరావు కి పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు మొదటి నుండి మద్దతు గా నిలిచారు. అయితే అధికార పార్టీ వైసీపీ కి రాపాక వరప్రసాద్ అనుకూలంగా వ్యవహరిస్తూ, సీఎం జగన్ ప్రవేశ పెడుతున్న పథకాల పై ప్రశంశల వర్షం కురిపిస్తూ జన సేన పార్టీ కి దూరం అయ్యారు. జన సేన పార్టీ పై, అధినేత పవన్ కళ్యాణ్ పై రాపాక సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ను నడిపించే విధానం పై కూడా గతం లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే రాజోలు లు జన సేన పార్టీ బహిరంగ సభ నేపథ్యం లో ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కి నో ఎంట్రీ అంటూ ఫ్లెక్సీ లు ఏర్పాటు కావడం పట్ల ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తాజాగా స్పందించారు.

రాజోలు లో 50 వేల మంది జన సైనికులు 2019 ఎన్నికల్లో రాపాక విజయం కోసం శ్రమించారు అని నాదెండ్ల మనోహర్ అన్నారు. మా పార్టీ ఎమ్మెల్యే గా రాపాక పై పోలీసులు అక్రమ కేసులు పెడితే పవన్ కళ్యాణ్ రాజోలు వచ్చి అండగా నిలిచారు అని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు రాపాక అధికార పార్టీ తో కలిసి రాజోలు లో జన సేన కార్యకర్తల పై కేసులు పెట్టించడం సరికాదు అని అన్నారు. అయితే ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రాజోలు నియోజక వర్గంలో జన సేన మరొకసారి ఎక్కువ సీట్లను గెలిచిన సంగతి తెలిసిందే.