టెండర్ ప్రక్రియ పై శ్వేతపత్రం విడుదల చేయాలి – నాదెండ్ల మనోహర్

Monday, March 22nd, 2021, 08:16:30 AM IST

వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల జన సేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొత్త ఇసుక విధానం పేరిట ఓ ప్రైవేట్ సంస్థ కి ఇసుక తవ్వుకొనేందుకు వైసీపీ అనుమతులు ఇచ్చి మరొకసారి రాష్ట్ర ప్రజలను మోసం చేసింది అంటూ చెప్పుకొచ్చారు. మూడు భాగాలుగా విభజించిన టెండర్ ప్రక్రియ లో అనేక సందేహాలు ఉన్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే జేపీ పవర్ ను ఏ విధంగా ఎంపిక చేశారు అని, టెండర్ ప్రక్రియ ఎలా పూర్తి చేశారు అని వరుస ప్రశ్నలు సంధించారు. వీటన్నిటికీ సంబందించిన అంశాల పై శ్వేతపత్రం విడుదల చేయాలి అంటూ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. అయితే విశాఖ లో ఎక్కువగా నిర్మాణాలు జరుగుతున్నాయి అని, అక్కడ తక్కువకు టెండర్ అప్పగించడం పై అనుమానాలు ఉన్నాయి అని తెలిపారు. అయితే కొందరు నాయకులు ఇసుకను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు తరలించుకుపోయారు అని వ్యాఖ్యానించారు.

అయితే ఇసుక విధానాలు ప్రభుత్వ గందరగోళ పని తీరుకు అద్దం పడుతున్నాయి అని వ్యాఖ్యానించారు.అయితే వైసీపీ అధికారం లోకి వచ్చిన వెంటనే ఇసుక సరఫరా నిలిపివేసి లక్షలాది మంది భవన కార్మికులను రోడ్డున పడేసింది అని ఆరోపించారు. అయితే ఇసుక కృత్రిమ కొరత పై జన సేన పోరాటం కూడా చేసింది అని చెప్పుకొచ్చారు.