ఎస్ఈసి నిర్ణయం పై జనసేన అసంతృప్తి…కొత్తగా ప్రారంభించండి

Monday, February 15th, 2021, 06:09:35 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరగాల్సిన మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు గతేడాది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే నేడు ఎన్నికల కమిషనర్ విడుదల చేసిన షెడ్యూల్ పట్ల పలువురు నేతలు స్పందిస్తున్నారు. ఈ మేరకు జన సేన పార్టీ సైతం స్పందించింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పురపాలక ఎన్నికల ప్రక్రియను నిలిపి వేసిన చోట నుండి కొనసాగిస్తున్నాం అంటూ ఉత్తర్వుల్లో పేర్కొనడం పట్ల జన సేన అసంతృప్తి వ్యక్తం చేసింది. అలా కొనసాగించడం సరి కాదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే కొత్తగా మళ్ళీ ప్రారంభించేందుకు ఉన్న అవకాశాలు అన్ని కూడా పరిశీలించాలి అంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి విజ్ఞప్తి చేయడం జరిగింది.

అయితే ఈ మొత్తం వ్యవహారం పై జన సేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పలు వ్యాఖ్యలు చేశారు. గతేడాది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కరోనా వైరస్ విపత్తు కారణంగా ఎన్నికల వాయిదా ను స్వాగతించామని, అయితే గతంలో నామినేషన్ల సమయం లో అభ్యర్దులు, ఓటర్లను అధికార పక్షం మభ్య పెట్టింది అని సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఇలా ఆగిన చోట నుండి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడం ప్రజస్వామ్య బద్దం కాబోదు అంటూ నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. అయితే దీని పై ఎన్నికల కమిషనర్ ఎలా స్పందిస్తారో చూడాలి.