సర్కార్ వారి పాటకు ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా?

Friday, December 11th, 2020, 07:10:37 PM IST

ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ హిట్ కొట్టిన మహేష్ బాబు తాజాగా దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో సర్కార్ వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ 2021 జ‌న‌వ‌రి నుంచి మొద‌లుకానుంది. అయితే ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసి శ్రీమంతుడు సినిమా విడుద‌ల అయిన ఆగ‌స్టు 7వ తేదీనే విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారట.

అయితే దీనికి కారణం లేకపోలేదు. మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు చిత్రం ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాను కూడా మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మించింది. అయితే శ్రీమంతుడు చిత్రం మైత్రి మూవీ మేకర్స్ కి మొదటి సినిమా. మొదటి సినిమానే భారీ హిట్ కావడంతో ఆగ‌స్టు 7వ తేదీనే సర్కారు వారి పాట చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మైత్రి నిర్వాహకులు. మరీ సర్కార్ వారి పాటకు ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి మరీ.