టీమ్ ఇండియా బౌలర్ అశ్విన్ పై ముత్తయ్య మురళీధరన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Thursday, January 14th, 2021, 03:38:49 PM IST

శ్రీలంక బౌలర్, స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ టీమ్ ఇండియా బౌలర్, స్పిన్నర్ అశ్విన్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం స్పిన్నర్ లలో అశ్విన్ అత్యుత్తమ ఆటగాడు అని, అతను ఒక్కడే టెస్టుల్లో 700 నుండి 800 వికెట్లను తీయగలడు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆస్ట్రేలియా స్పిన్నర్ లైయన్ అన్ని వికెట్లు తీయలేడు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ముత్తయ్య మురళీధరన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. అయితే అశ్విన్ మాత్రమే 800 వికెట్ లను తీయగలదు అంటూ చేసిన వ్యాఖ్యలు టీమ్ ఇండియా ఆత్మ స్థైర్యాన్ని పెపొందించేలా ఉంది.

అయితే ఇప్పుడు లైయన్ 396 వికెట్ లతో కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాక రవి చంద్రన్ అశ్విన్ 74 టెస్టుల్లో 377 వికెట్ లను తీశాడు. అయితే లైయన్ 396 వికెట్ లు తీయడానికి 99 టెస్టు మ్యాచ్ లు ఆడిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్ లను వన్డే, టీ 20 లు మార్చేశాయి అని, టెస్టు మ్యాచ్ లలో స్పిన్నర్లు సులువుగా వికెట్ లను తీయగలరు అంటూ చెప్పుకొచ్చారు. అయితే టీమ్ ఇండియా ఆస్ట్రేలియా ల మధ్య నాల్గవ టెస్ట్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనే దాని పై ఆసక్తి నెలకొంది.