బిగ్ బ్రేకింగ్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కు మరణ శిక్ష

Tuesday, December 17th, 2019, 02:32:07 PM IST

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ను దోషిగా తెలుస్తూ పాకిస్తాన్ ప్రత్యేక కోర్ట్ మరణశిక్షను విధించింది. పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 6 ప్రకారం ముషారఫ్ తీవ్రమైన దేశ ద్రోహానికి పాల్పడినట్లు కోర్ట్ తెలిపింది. ముగ్గురు న్యాయమూర్తుల్లో ఇద్దరు ముషారఫ్ కు మరణ శిక్ష విధించాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ముషారఫ్ దుబాయ్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

ముషారఫ్ 1999 నుండి 2008 వరకు పాకిస్తాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే ముషారఫ్ 2007 లో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎమర్జెన్సీ విధించడం జరిగింది. 2007 నవంబర్ 3 న విపక్ష నేతలను, న్యాయమూర్తులని చట్టానికి విరుద్ధంగా నిర్బంధించారు. అనేకమంది అధికారులను, న్యాయమూర్తులని తొలగించడం జరిగింది. అంతేకాకుండా మీడియా ఫై కూడా ఆంక్షలు విధించారు. అయితే ఈ ఘటన ఫై 2013 లో దేశ ద్రోహం కేసు నమోదవ్వగా, విచారణ సమయంలో దేశం వదిలి వెళ్లిపోయారు. విచారణకు హాజరు కావాలని ఎన్నిసార్లు చెప్పిన కోర్ట్ మాటలు వినిపించుకోలేదు. అయితే మొట్టమొదటి సారి ఒక దేశానికి అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తికీ ఉరి శిక్ష పడనుంది. అయితే ముషారఫ్ ని అదుపులోకి తీసుకోవడం ఆ ప్రభుత్వానికి ఒక సవాల్ కానుంది.