ఏపీ లో ప్రారంభమైన పురపాలక ఎన్నికల పోలింగ్

Wednesday, March 10th, 2021, 08:30:20 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పురపాలక, నగర పంచాయతీ లలో ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. 2,214 డివిజన్, వార్డ్ స్థానాలకు గానూ ఇప్పటికే 580 ఏకగ్రీవం కాగా, మిగతావాటికి నేడు పోలింగ్ జరుగుతుంది. అయితే ఏలూరు నగరపాలక సంస్థలో ఎన్నికలు నిలిపి వేయాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ సోమవారం స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే డివిజన్ బెంచ్ మంగళవారం నాడు సస్పెండ్ చేయడం తో ప్రస్తుతం అక్కడ కూడా పోలింగ్ ప్రారంభం అయింది. అయితే ఇప్పటికే నాలుగు మున్సిపాలిటీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 71 పురపాలికలు, 12 నగర పాలక సంస్థలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈ మొత్తం స్థానాల కోసం 7,549 మంది అభ్యర్దులు బరిలో ఉండగా 77,73,231 మంది ఓటర్లు నేడు ఓటు అవకాశాన్ని వినియోగించుకోనున్నారు. అయితే సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.