మాజీ క్రికెటర్ సురేష్ రైనా అరెస్ట్…అసలు కారణం ఇదే

Tuesday, December 22nd, 2020, 01:44:31 PM IST

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ముంబై విమానాశ్రయానికి చేరువలో ఉన్నటువంతి ముంబై డ్రాగన్ ఫ్లై క్లబ్ లో జరిగిన దాడుల్లో రైనా తో పాటుగా ప్రముఖ గాయకుడు గురు రాందవ ను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే వారిని బెయిల్ పై విడుదల చేసినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ నిబంధనలకు విరుద్ధంగా క్లబ్ నడుపుతున్నట్లు సమాచారం రావడం తో పోలీసులు రైడ్ చేసినట్లు తెలుస్తోంది.అయితే క్లబ్ కి చెందిన సిబ్బంది తో పాటుగా మిగతా 34 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.అయితే క్రికెటర్ సురేష్ రైనా తో పాటుగా మిగతా వారి పై ఐపిసి సెక్షన్ 188,269, 34ఎన్ ఎం డీ ఏ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు అక్కడి పోలీసులు తెలిపారు.