ముఖేష్ అంబాని @ నెం 1

Wednesday, September 17th, 2014, 06:34:31 PM IST


భారత దేశంలో సంపన్నుల జాబితాను హురూన్ ఇండియా విడుదల చేసింది.ఈ మ్యాగజైన్ ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబాని మొదటి స్థానంలో నిలిచారు. ముఖేష్ అంబాని ఆస్తులు ఈ సంవత్సరం 37 శాతం మేర పెరిగాయి. 1.65 లక్షల కోట్ల రూపాయలతో మొదటి స్థానంలో నిలిచారు. ఆదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదాని పదో స్థానంలో నిలిచారు.. ఇక సన్ ఫార్మా వ్యవస్థాపకులు దిలీప్ సంఘ్వీ రెండో స్థానంలో నిలిచారు. అర్సేలార్ మిట్టల్ మూడో స్థానంలో, విప్రో నాలుగో స్థానంలో నిలిచాయి.. ఇక హెచ్ సిఎల్ చైర్మన్ శివ నాడార్ అయిదో స్థానంలో, హిందుజా చైర్మన్ హిందుజా ఆరోస్థానంలో నిలిచారు. షావుర్జీ పల్లోంజీ చైర్మన్ పీ మిస్త్రి ఏడో స్థానంలో, బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా ఎనిమిదో స్థానంలో నిలిచారు. ఇక భారతీ ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్ తొమ్మిదో స్థానంలో నిలవడం విశేషం..