ముకేశ్ అంబానీ ఖాతాలో మరో రికార్డ్.. ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానం..!

Saturday, August 8th, 2020, 11:17:18 PM IST


రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఖాతాలో మరో రికార్డ్ నమోదయ్యింది. ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన నాలుగో స్థానం దక్కించుకున్నాడు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం 80.2 బిలియన్‌ డాలర్ల సంపదతో నాలుగో స్థానంలో నిలిచారు. ఈ ఏడాది రిలయన్స్ టెలికాం విభాగం జియో ప్లాట్ ఫాంలోకి దిగ్గజ సంస్థలైన గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాప్ట్ పెట్టుబడులు పెట్టడంతో ఆయన కంపెనీల షేర్ విలువ భారీగా పెరిగింది.

అయితే ఈ ఇండెక్స్‌ ప్రకారం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఆస్తి 187 బిలియన్ డాలర్ల సంపదతో మొదటి స్థానంలో నిలవగా, మైక్రోసాఫ్ట్‌ కో ఫౌండర్‌ బిల్‌ గేట్స్‌ 121 బిలియన్ల సంపాదనతో రెండవ స్థానంలో, ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ 102 బిలియన్ డాలర్ల సంపాదనతో మూడవ స్థానంలో నిలిచాడు.