పట్టుదలకు పోకండి.. ప్రధాని మోదీకి ముద్రగడ లేఖ..!

Tuesday, December 8th, 2020, 03:18:28 PM IST

నేడు దేశవ్యాప్తంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు భారీ మద్దతు లభించింది. ఇప్పటికే దాదాపు అన్ని పార్టీలు, పలు సంఘాలు రైతుల బంద్‌కు మద్ధతు తెలుపుతూ రోడ్లపై బైఠాయించి నిరసనలు వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే రైతులు చేపట్టిన ఉద్యమంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. రైతులు చేస్తున్న ఉద్యమం పట్ల పట్టుదలకు పోకుండా కేంద్రం పునరాలోచించుకోవాలని సూచించారు.

అయితే ణగారిన వర్గాల కోసం చట్టాలు చేయాలే కానీ, పారిశ్రామిక వర్గాల ప్రయోజనం కోసం కాదని లేఖలో పేర్కొన్నారు. రైతుల సమస్యను మీ దృష్టికి తెస్తున్నందున తనను దేశద్రోహిలా చూడకండని అన్నారు. రైతులు చేస్తున్న ఉద్యమం మీ మనసును నొప్పించి ఉంటే కనుక పెద్దమనసుతో వారిని క్షమించాలని కోరారు. దేశానికి అన్నంపెట్టే రైతన్నల కోసం తమరు ఒక మెట్టు దిగినా తప్పులేదని, అలా చేస్తే తమరి కీర్తి ఎల్లప్పుడూ అలాగే ఉంటుందని ముద్రగడ చెప్పుకొచ్చారు.