ఏ పార్టీ నేతలు ఉన్నా, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నా, చర్యలు తప్పవు

Saturday, August 15th, 2020, 08:37:40 PM IST

Ycp-mp-vijayasai-reddy

వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి భూ కబ్జాలకు పాల్పడేవారికి వార్నింగ్ ఇచ్చారు. భూ కబ్జాలకు పాల్పడితే ఎంతటి వారైనా చర్యలు తప్పవు అని అన్నారు. అయితే వైజాగ్ రాజధాని గా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తో వైజాగ్ లో ల్యాండ్ కి కాస్త డిమాండ్ పెరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే భూ కబ్జాలు చేసే వారి పై సీఎం జగన్ అగ్రహ్ వ్యక్తం చేస్తున్నారు అని తెలిపారు. అయితే అక్రమాలకు పాల్పడే వారు ఎంత పెద్ద వారైనా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించిన విషయాన్ని తెలిపారు.

అయితే ఈ వ్యవహారం లో ఏ పార్టీ నేతలు ఉన్నా, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నా, చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు. అయితే విశాఖ లో విజయ సాయి రెడ్డి పేరు చెప్పి భూ సెటిల్ మెంట్ చేసే వారి పై చర్యలు తీసుకోవడం తప్పదు అని అన్నారు. అయితే తన పేరును ఉపయోగించి మోసాలకు పాల్పడే వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తామని అన్నారు. అయితే ప్రభుత్వం, దేవాలయ, ఏ ఇతర భూముల జోలికి వచ్చినా వదిలేది లేదు అంటూ హెచ్చరికలు జారీ చేసారు.