రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు – ఎంపీ విజయసాయిరెడ్డి

Monday, September 28th, 2020, 11:20:33 AM IST

ఏపీలో చాలా క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్నాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయసాయిరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. రోజు రోజుకు మానవతా, నైతిక విలువలు దిగజారుతున్నాయని, వాటిని కాపాడాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

అయితే వ్యవస్థల మధ్య ఎటువంటి వ్యత్యాసాలు, అభిప్రాయభేదాలు లేకుండా అంబేద్కర్ ఎంతో ముందు చూపుతో భారత రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. అయితే కొంతమంది స్వార్థపూరకమైన భావాలు, ఉద్దేశాలతో రాజ్యాంగ వ్యవస్థల మధ్య విభేదాలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. స్వప్రయోజనాల కోసం రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్న వారికి సద్బుద్ధిని ప్రసాదించాలని ఆ వెంకన్నను కోరుకున్నట్టు తెలిపాడు.