సీఎం జగన్ పాలన పై విజయసాయి రెడ్డి ప్రశంసలు…కానీ!

Sunday, August 30th, 2020, 05:05:25 PM IST

Vijaya_sai_Reddy

వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి ప్రతి పక్ష పార్టీ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూనే, అధికార పార్టీ, జగన్ పాలన పై ప్రశంసలు కురిపించారు. ఏడాది లోనే ఎవరూ ఊహించని రీతిలో సీఎం జగన్ గారి సుపరిపాలన అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అర్హత కలిగిన అన్ని వర్గాల వారికి 41718 కోట్ల రూపాయల ను అందించిన విషయాన్ని, 90 శాతం హామీలు అమలు చేసిన విషయాన్ని వెల్లడించారు. ఏడాది పాలన పై ప్రజల వద్దకు మేనిఫెస్టో, ప్రోగ్రెస్ రిపోర్టు అంటూ పలు వ్యాఖ్యలు చేశారు. మేనిఫెస్టో ను మాయం చేసిన బాబెక్కడ, ప్రజలకే తన ప్రోగ్రెస్ రిపోర్ట్ అడుగుతున్న జగన్ గారు ఎక్కడ అని పోల్చి చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఘాటు విమర్శలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కోరుకునేది పప్పు, బెల్లం కాదు అని, అభివృద్ది అని, అది రాష్ట్రం లో ఎక్కడా కూడా జరగలేదు అని, ప్రజల రక్తాన్ని ఇసుక రూపం లో, వైన్ షాప్ లలో కొత్త బ్రాండ్స్ రూపం లో తాగుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి కొందరు ఆదాయం ఎక్కడ నుండి వస్తుంది, ప్రజలకి ఎలా ఖర్చు చేస్తున్నారు, ఏ వర్గానికి చెందిన నిధులను ఎంత ఖర్చు చేస్తున్నారు అంటూ విజయసాయి రెడ్డి కి వరుస ప్రశ్నలు వేస్తున్నారు.