ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఆనందంగా ఉంది – విజయసాయి రెడ్డి

Monday, February 15th, 2021, 08:23:42 AM IST

Ycp-mp-Vijayasai-reddy

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. అయితే ఇదే విషయాన్ని వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 2024 నాటికి ఆంధ్ర రాష్ట్రాన్ని మద్యపాన రహితంగా చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని మూడు దశల్లో అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కార్య చరణను రూపొందించింది అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. మేనిఫెస్టో లో ఇచ్చిన ఒక్కో హామీని నెరవేరుస్తూ ఆయన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఆనందంగా ఉంది అని ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

అయితే దశల వారీగా మద్యపానం నిషేదం అమలు చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు.2019 తో పోలిస్తే 2020 లో ఆంధ్ర ప్రదేశ్ లో మద్యం వినియోగం గణనీయంగా తగ్గింది అని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాల నుండి మద్యం రవాణా పై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించడంతో పాటు రాష్ట్ర సరిహద్దుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అయితే మద్యం వినియోగం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక బార్ లైసెన్స్ పై 20 శాతం, కొవిడ్ 19 ఫీజు, మద్యం విక్రయాలు పై 10 శాతం అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నును విదించింది అంటూ చెప్పుకొచ్చారు.