దేవాలయ అభివృద్ధికి 70 కోట్ల ప్రభుత్వం ఖజానా నుండి నిధులు

Friday, January 8th, 2021, 02:47:32 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమును అన్ని విధాలుగా అభివృద్ది చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అయితే ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాల పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దసరా ఉత్సవాల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు మన సీఎం గారు అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పై ప్రశంసల వర్షం కురిపించారు.చరిత్రలోనే దేవాలయ అభివృద్ధికి 70 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుండి నిధులు మంజూరు అంటూ విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. విజయవాడ దుర్గమ్మ ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన అని తెలిపారు. ఆలయం పేరుతో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లను కైంకర్యం చేసిన చంద్రబాబా గుళ్ల గురించి మాట్లాడేది అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు.

అయితే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. వైసీపీ తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. అయితే దేవాదాయ భూముల అమ్మకాలు, దేవాలయాల పై జరుగుతున్న దాడులను డైవర్ట్ చేయడానికి మీరు ఎన్ని చేసినా ప్రజలు అసహ్యించుకుంటూనే ఉన్నారు అని అంటున్నారు. కొందరు వైసీపీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తుండగా, మరి కొందరు మాత్రం టీడీపీ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.