ప్రతి కుటుంబానికి 15 లక్షల ఆస్తి సొంతమవుతుంది

Thursday, December 31st, 2020, 08:30:34 AM IST

Vijaya_sai

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పేద ప్రజలకు ఇళ్ళ స్థలాలు పంపిణీ చేస్తున్న వైసీపీ ప్రభుత్వం పై ఎంపీ విజయసాయి రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నిరుపేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ తో సీఎం జగన్ మోహన్ రెడ్డి దార్శనికతను దేశమంతా కొనియాడుతూ ఉంది అని తెలిపారు. శాశ్వత చిరునామా అంటూ లేని 30 లక్షల కుటుంబాలకు ఇంత భారీ స్థాయిలో ఉచితంగా స్థలాలు అందజేయడం చరిత్రలో నిలిచిపోతుంది అంటూ చెప్పుకొచ్చారు. పక్కా గృహాల నిర్మాణం పూర్తి అయితే ప్రతి కుటుంబానికి కూడా 15 లక్షల ఆస్తి సొంతం అవుతుంది అంటూ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

అయితే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. సీఎం జగన్ నిజంగానే పేదవాడి కలను నిజం చేయబోతున్నారు అంటూ కొనియాడుతున్నారు. పలువురు వైసీపీ నేతలు, అభిమానులు సీఎం జగన్ మోహన్ రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే కాంట్రాక్ట్ బేస్ మీద ఉండే ఉద్యోగులకు 7 నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదు అని, అడిగితే బడ్జెట్ లేదు అని, ఆ విషయం మీరు చూడండి అంటూ కొందరు చెబుతున్నారు.