రాష్ట్ర వ్యాప్తంగా కోటిమంది కి కరోనా వాక్సిన్లు – వైసీపీ ఎంపీ

Wednesday, December 16th, 2020, 08:20:45 AM IST

Ycp-mp-Vijayasai-reddy
కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా కరోనా వైరస్ కట్టడి చేయడం కుదిరింది అంటూ మరోమారు వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

డిసెంబర్ 25 నుండి రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి వాక్సిన్లు ఇచ్చే బృహత్ కార్యక్రమం ప్రారంభం కానుంది అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 4,762 ఆరోగ్య కేంద్రాల్లో వాక్సినేషన్ జరుగుతుంది అని పేర్కొన్నారు. అయితే కోటికి పైగా టెస్టులు నిర్వహించి వైరస్ వ్యాప్తి ను నియంత్రించడం లో రాష్ట్రం విజయం సాధించింది అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇప్పటికే పలు యూరప్ కంట్రోల్లో టైర్ 3 లాక్ డౌన్ అమలు అవుతుంటే కోటి టీకాలు సప్లై చేసేది ఎవరూ అంటూ సూటిగా ప్రశ్నించారు. మరి కొందరు మాత్రం సీఎం జగన్ పాలనా విధానం పై ప్రశంసల వర్షం కురిపించారు.