ఇకపై ఉపాధి కోసం యువత బయటకు వెళ్ళే అవసరమే ఉండదు

Monday, December 14th, 2020, 07:27:29 AM IST

Ycp-mp-Vijayasai-reddy

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనా విధానంపై పరోక్షంగా విమర్శలు చేస్తూనే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపించారు వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి. టీడీపీ పాలన లో జరిగిన విషయాల గురించి ప్రస్తావిస్తూ తరచూ చంద్రబాబు పై విమర్శలు చేస్తున్న విజయసాయి రెడ్డి, మరొకసారి సీఎం జగన్ పాలన విధానం పై కీలక వ్యాఖ్యలు చేశారు.

వందల కోట్ల దుబారా తో పార్టనర్ షిప్ సమ్మిట్ లు లేవు, దావోస్ లో రోడ్ షో లు, ప్రచార ఆర్భాటాలు లేవు అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి విశ్వసనీయతే ప్రామాణికంగా రాష్ట్రానికి పెట్టుబడులు తరలి వస్తున్నాయి అని కొనియాడారు. ఇక పై ఉపాధి కోసం యువత బయటకు వెళ్ళే అవసరమే ఉండదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు.

కొందరు ఆ పెట్టుబడుల వివరాలు వివరించండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.