ప్రధాని తర్వాత ఉన్నారు మన సీఎం జగన్ గారు – వైసీపీ ఎంపీ

Wednesday, November 25th, 2020, 07:49:41 AM IST

Ycp-mp-Vijayasai-reddy

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశం లో అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నాయకుల్లో రెండవ స్థానం లో ఉన్నారు అంటూ వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఈ మేరకు ప్రతి పక్ష పార్టీ పై ఘాటు విమర్శలు చేస్తూనే, సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు విజయసాయి రెడ్డి.

ట్రెండ్ సెట్ చేయడం అంటే పచ్చ మీడియా లో పెయిడ్ న్యూస్ ఇచ్చుకోవడం కాదు అని పరోక్షంగా తెలుగు దేశం పార్టీ పై విమర్శలు చేశారు. అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నేతగా సోషల్ మీడియాలో ప్రధాని తర్వాత ఉన్నారు మన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని తెలిపారు. ఆగస్ట్ – అక్టోబర్ మధ్యలో 2,171 ట్రెండ్స్ తో మోడీ తొలి స్థానం లో 2,137 ట్రెండ్స్ తో రెండవ స్థానం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. టీడీపీ పై కొందరు ఘాటు విమర్శలు చేస్తుండగా, మరి కొందరు మాత్రం వైసీపీ పై విమర్శలు చేస్తున్నారు. జగన్ అభిమానులు మాత్రం ఈ రెండవ స్థానం పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.