సీఎం జగన్ దార్శనికతతో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు వస్తున్నాయి

Friday, November 13th, 2020, 10:21:12 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో కి తీసుకొని వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ నేతలు కృషి చేస్తున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాల కారణంగా ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు వినూత్న ఆలోచనలకు స్వాగతం చెబుతున్నారు. అయితే ఈ నేపథ్యం లో వన్సినవే స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు. అయితే ఈ అంశం గురించి వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

మన చదువులు డిగ్రీల కోసం తప్ప ఉద్యోగాలకు పనికిరావు అనే చర్చ దశాబ్దాలుగా జరుగుతోంది అని చెప్పుకొచ్చారు. నిరుద్యోగం పై మాట్లాదుకున్నప్పుడల్లా నైపుణ్యాల ప్రస్తావన వస్తుంది అని ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి దార్శనికత తో దేశంలోనే తొలిసారి స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు వస్తున్నాయి అని అన్నారు. నిపుణులు అయిన యువత ఉద్యోగాలకు సిద్దంగా ఉంటారు అని తెలిపారు.