రైతులకి ఎందుకు ఉచిత విద్యుత్ అన్నవారే ఇప్పుడు విమర్శిస్తున్నారు

Friday, September 4th, 2020, 05:50:08 PM IST

Ycp-mp-Vijayasai-reddy

వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన పై ప్రశంసల వర్షం కురిపిస్తూ నే, ప్రతి పక్ష పార్టీ పై ఘాటు విమర్శలు చేస్తున్నారు. తండ్రి ఆశయాలను ముందుకు తీసుకు వెళుతూ, రైతులకు మేలు చేకూరుస్తున్న ముఖ్యమంత్రి జగన్ గారు అని కొనియాడారు.ఒక్క కనెక్షన్ కూడా తొలగించకుండా, కొత్తగా లక్ష కనెక్షన్లు ఇస్తూ, డబ్బు నేరుగా రైతుల ఖాతాలోకె వేసేందుకు నిర్ణయించిన ప్రభుత్వం అని తెలిపారు.అంతేకాక చివరిగా రైతులకు ఎందుకు ఉచిత విద్యుత్ అన్నవారే ఇప్పుడు విమర్శస్తున్నారని వ్యాఖ్యానించారు.

మరొక ట్వీట్ లో ఎన్నో ఏళ్లుగా నాయకులు అని చెప్పుకున్న వాళ్ళు విస్మరించిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి పూనుకున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్ గారు అని అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకి వరం అని అన్నారు. ఇక పై తాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు నీటి ఇబ్బంది ఉండదు అని తెలిపారు.