ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి జగన్ గారికి ఉన్న నిబద్దత కి ఇది నిదర్శనం

Thursday, October 15th, 2020, 08:00:20 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలు శరవేగంగా కార్యరూపం దాల్చుతున్నాయి. అయితే ఇందులో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం కింద నెట్ వర్క్ ఆసుపత్రులకు 148.37 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది. అంతేకాక ఉద్యోగులకు హెల్త్ స్కీం కింద 31.97 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి జగన్ గారికి ఉన్న నిబద్దత కి నిదర్శనం అంటూ వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ప్రతి పథకం పై ప్రశంసలు కురిపించే విజయసాయి రెడ్డి మరొకసారి సీఎం జగన్ అమల్ చేస్తున్న వైఎస్ఆర్ పథకం గురించి కీలక వ్యాఖ్యలు చేయడం తో నెటిజన్లు స్పందిస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టే పథకాల పై కూడా పలువురు కామెంట్స్ చేస్తుండగా, మరి కొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు.