యనమలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఎంపీ విజయసాయి రెడ్డి

Sunday, March 28th, 2021, 06:04:26 PM IST

తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అన్నేళ్లు ఆర్థిక మంత్రి గా పని చేసినా నిబంధనల పట్ల కనీస అవగాహన లేదు యనమల కు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఎన్టీఆర్ వెన్నుపోటు కుట్ర లో బాబుకి కత్తి అందించినందుకు ఇప్పటికీ పదవులు దక్కించుకుంటున్నాడు అంటూ చెప్పుకొచ్చారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అర్డినెన్స్ ఎప్పుడు అవసరమో తెలియదు ఈ స్వయం ప్రకటిత మేధావి కి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి. అయితే ఎంపి విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరొకసారి హాట్ టాపిక్ గా మారాయి.

అయితే వైసీపీ ప్రభుత్వం తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలు చర్చంశనీయం గా మారాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సు వ్యవహారం పట్ల యనమల రామకృష్ణుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన విమర్శలకు గానూ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించి, ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి గానూ నెటిజన్లు స్పందిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు మాత్రం తెలుగు దేశం పార్టీ నేతల తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.