ఇప్పుడంత అజ్ఞానం ఎవరికీ లేదు – వైసీపీ ఎంపీ

Sunday, November 22nd, 2020, 03:30:45 PM IST

వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి పక్ష పార్టీ కి మద్దతుగా నిలుస్తున్న మీడియా ను ఎల్లో మీడియా అంటూ పలుమార్లు సంబోధిస్తూ విజయసాయి రెడ్డి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మరొకసారి టీడీపీ ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ ఎల్లో మీడియా పై పలు వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి.

ఈర్ష, ద్వేషాలతో రగిలిపోయేవారు ఎవర్నైనా అప్రతిష్ట పాలు జేయాలి అంటే ఒకప్పుడు ఆకాశ రామన్న పేరుతో కరపత్రాలు వేయించి వదిలేవారు అని తెలిపారు. అయితే అది కొందరు నిజమే అని నమ్మే పరిస్తితి ఉండేది అని అన్నారు. అయితే ఇప్పుడు అంత అజ్ఞానం ఎవరికి లేదు అని తెలిపారు. అయినా, ఎల్లో మీడియా 40- 50 ఏళ్ల క్రితం నాటి కరపత్రాల టెక్నిక్ నే నమ్ముకుంది ఇప్పటికీ అంటూ సెటైర్స్ వేశారు. వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు.

పలు అంశాల్లో టీడీపీ తీరును, వైసీపీ తీరును ఎండగడుతూ నెటిజన్లు ఘాటు విమర్శలు చేస్తున్నారు. కొందరు వైసీపీ తీరును నిలదీస్తూ వరుస ప్రశ్నలు వేస్తున్నారు. కొందరు గత టీడీపీ పాలన విధానం పై విమర్శలు చేస్తున్నారు. అయితే విజయసాయి రెడ్డి తీరు ఢిల్లీ లో చేస్తున్న రాజకీయాల అంశాల పై, వైజాగ్ పరిపాలన రాజధాని విషయం పై నెటిజన్లు గట్టి సెటైర్స్ వేస్తున్నారు.