పేదల ప్రయోజనాల కన్నా పచ్చ నాయకుని ప్రయోజనాలే ఎక్కువైపోయాయా?

Monday, October 26th, 2020, 07:28:18 AM IST

Ycp-mp-Vijayasai-reddy

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాల పట్ల తెలుగు దేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అక్రమ కట్టడాల మరియు ప్రభుత్వ భూముల స్వాధీనం పై సైతం వైసీపీ నేతలు గత ప్రభుత్వ టీడీపీ తీరు ను తప్పుబడుతూ వరుస విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా మరొకసారి వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.

అక్రమ కట్టడాలను చట్ట ప్రకారం కూలిస్తే పచ్చ బ్యాచ్ మొత్తం నెత్తి నోరు కొట్టుకుంటుంది అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఆంధ్రా యూనివర్సిటీ ను దయ్యాల కొంప అని, సదరు ఆక్రమ దారుడు వెటకారం చేసినప్పుడు పేదలు చదువుకొనే ఏయూను భ్రష్టు పట్టించినప్పుడు ఒక్కరూ మాట్లాడలేదు అని విమర్శించారు. పేదల ప్రయోజనాల కన్నా పచ్చ నాయకుని ప్రయోజనాలే ఎక్కువై పోయాయా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు.

అయితే గతంలో ఇడుపుల పాయ ను నిర్మించిన విధానం పై నెటిజన్లు స్పందిస్తున్నారు. అపుడు పేదల భూమిని ఆక్రమించి ఇడుపుల పాయ కట్టారు అని, దాని గురించి కూడా చెప్పమంటూ వ్యాఖ్యానిస్తున్నారు.