ఎన్టీఆర్ స్థాపిస్తే బాబు సమాధి చేశాడు పార్టీని – ఎంపీ విజయసాయి రెడ్డి

Tuesday, March 30th, 2021, 02:21:31 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రతి పక్ష పార్టీ అయిన తెలుగు దేశం ఆవిర్భావ దినోత్సవం రోజున కొత్త నాయకుడు వస్తాడు అనే అంశం పై విపరీతమైన చర్చ జరిగింది. అయితే ఈ వ్యవహారం పట్ల అటు ప్రతి పక్ష పార్టీ లో మాత్రమే కాకుండా ,అధికార వైసీపీ మరియు ప్రజల్లో కూడా చర్చలు జరిగాయి. అయితే వైసీపీ కి చెందిన నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మాత్రం తెలుగు దేశం పార్టీ నేతల పై మరొక్కసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తండ్రీ కొడుకుల దృతరాష్ట్ర కౌగిలి నుండి బయట పడేదెప్పుడు అంటూ విజయసాయి రెడ్డి విమర్శించారు. పార్టీకి కొత్త నాయకత్వం వచ్చేది ఎప్పుడు బుచ్చాన్నా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే త్వరలో చీలికలు, పీలికలు అయి ఎవరి ముక్క వారు లాక్కెళ్తారు అని సూటిగా చెప్పొచ్చు గా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే నూతన నాయకులు రావడానికి ఏం మిగిలింది అని అంటూ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ స్థాపిస్తే బాబు సమాధి చేసాడు పార్టీని అంటూ చెప్పుకొచ్చారు ఎంపీ విజయసాయి రెడ్డి. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు ఘాటు గా స్పందిస్తున్నారు. ఎంపీ విజయ సాయి రెడ్డి తీరును ఎండగడుతూ వరుస విమర్శలు గుప్పిస్తున్నారు.