నిమ్మాడా అంటే చంద్రబాబు రాసిచ్చిన దివాణమా?

Monday, February 1st, 2021, 11:23:09 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికల హడావుడి మొదలైంది. అయితే ఈ ఎన్నికలు చాలా ఏళ్ళ తర్వాత మళ్లీ జరుగుతుండటం తో అటు అధికార పార్టీ, ఇటు ప్రతి పక్ష పార్టీ లు తమ అభ్యర్ధలను గెలిపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే అక్కడక్కడ జరుగుతున్న కొన్ని సంఘటనల తో రాజకీయ వేడి రాజుకుంటుంది. అయితే ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అచ్చనాయుడు పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏంటి అచ్చెన్నా.. నిమ్మాడా అంటే చంద్రబాబు రాసిచ్చిన దివాణమా అంటూ సూటిగా ప్రశ్నించారు. మీరు డిక్టెట్ చేసిన వ్యక్తి తప్ప ఇంకొకరు సర్పంచ్ గా నామినేషన్ వేయకూడదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సూటిగా ప్రశ్నించారు. అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు లేదూ అంటూ సెటైర్స్ వేశారు విజయసాయి రెడ్డి. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు.

ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కి వ్యతిరేకంగా వెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వలన రామతీర్థం లో దాడి జరిగింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు మాత్రం విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు మద్దతు ఇస్తూ సానుకూలం గా స్పందిస్తున్నారు.