ఆలయాల్లో విగ్రహ ధ్వంసాల వెనుక టీడీపీ నాయకులు

Sunday, January 31st, 2021, 09:33:45 AM IST

Ycp-mp-Vijayasai-reddy

వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి తెలుగు దేశం పార్టీ నేతల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన వర్చువల్ సమావేశం లో విజయసాయి రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి విభజన సమయం లో జరిగిన వాటి పై, కరోనా వైరస్ విపత్తు తో రాష్ట్రం ఆర్ధికం గా నష్టపోయిన విషయాలను వివరిస్తూ ప్రత్యేక హోదా కల్పించాలి రాష్ట్రానికి అంటూ విజ్ఞప్తి చేశారు. అంతేకాక హైకోర్టు ను కర్నూల్ కి తరలించే ప్రక్రియ ప్రారంభించాలి అని కోరారు.

అయితే ఈ మేరకు పలు విషయాల గురించి ప్రస్తావించారు. వాల్తేరు డివిజన్ ను కొనసాగిస్తూనే, ప్రత్యేక రైల్వే జోన్ పనులను పూర్తి చేయాలని సూచించారు.మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల పైన విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. అయితే వ్యవసాయ ఉత్పత్తులను గిట్టుబాటు ధర పొందే హక్కును చట్టబద్దం చేయాలని సూచించారు. అయితే ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వరుసగా దేవాలయాల విగ్రహాల దాడుల పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వీటి ధ్వంసం వెనుక టీడీపీ నేతలు ఉన్నారు అంటూ సీసీటీవీ ఫుటేజ్ ల ఆధారంగా వెల్లడైంది అంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పలు అంశాల పై చర్చించిన విజయసాయి రెడ్డి, మహిళల భద్రత విషయం పట్ల, దిశ చట్టం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ లో జాతీయ ప్రాధాన్యత కలిగిన విశ్వ విద్యాలయాలను ఏర్పాటు చేయాలి అంటూ సూచించారు.