తండ్రీకొడుకులిద్దరూ రాజకీయంగా గల్లంతవుతారు

Monday, January 18th, 2021, 09:26:46 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్న తాజా పరిణామాల పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి వరుసగా స్పందిస్తూనే ఉన్నారు. అయితే ప్రతి పక్ష పార్టీ నేతల పై మాత్రం వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అధికారం లో లేనప్పుడు విద్వేషాలను రెచ్చగొట్టడం బాబు కి అలవాటే అంటూ విజయసాయి రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. గతంలో బంద్ లు, నిరసనలకు పిలుపు ఇచ్చినప్పుడల్లా ఎన్ని బస్సులు తగలబెట్టాలో జిల్లాల వారీగా టార్గెట్లు ఇచ్చేవాడు అని సొంత మనుషులే బయట పెట్టారు అంటూ విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆపరేషన్ టెంపుల్స్ దిమాలిషన్ కి స్కెచ్ వేసి అడ్డంగా దొరికిపోయారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

అంతేకాక మాలోకాన్ని, అందరికీ ఆమోద యోగ్యుడిగా, తీర్చి దిద్దాలి అంటే ప్రజలకి మేలు చేసే పనులను చేయాలి అని, వాళ్ళ మనసులు గెలవాలి అని విజయసాయి రెడ్డి సూచించారు. అయితే విగ్రహాలను ధ్వంసం చేసి,ప్రజల మధ్య అడ్డు గోడలు కడితే పోలీసులకు దొరికిపోతారు అంటూ విమర్శించారు. రాజకీయం గా తండ్రీకొడుకులిద్దరూ గల్లంతవుతారు అంటూ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే టీడీపీ పై, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ల పై చేస్తున్న వరుస విమర్శలతో ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల పలు చోట్ల చర్చలు జరుపుతున్నారు.