వీళ్ళు మనుషులా, రాక్షసులా? – విజయసాయి రెడ్డి

Wednesday, January 13th, 2021, 07:36:34 AM IST

Vijaya_sai

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో చోటు చేసుకుంటున్న పరిణామాలతో రాజకీయాలు వేడెక్కాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయం లో అటు అధికార పార్టీ, ఇటు ప్రతి పక్ష పార్టీ నేతలు ఒకరు పై మరొకరు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మేరకు వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి ప్రతి పక్ష నేతల పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరోనా భయంతో ముక్కుకి గుడ్డ కట్టుకుని హైదరాబాద్ లో దక్కుకున్నారు పెద్ద / చిన్న నాయుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 60 నుండి వందేళ్ల వృద్దులు కూడా పంచాయతీ ఎన్నికల్లో ఓటేయాలని అంటున్నారు అని విమర్శించారు. టీడీపీ బతకదు అని తెలుసు కాబట్టి ఏపీ ప్రజలు ఏమైనా పర్వాలేదు అని అనుకుంటున్నారు అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. వీళ్ళు మనుషులా రాక్షసులా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి చేసిన వ్యాఖ్యలను పలువురు తప్పు బడుతున్నారు.60 ఏళ్లు దాటిన వాళ్ళు రాజకీయాల్లో ఉండొచ్చు గానీ, 60 ఏళ్లు దాటిన వాళ్ళు ఓటేయ్యోచ్చు అంటే తప్పేంటి సార్ అంటూ నిలదీస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అందరూ ఓటేస్తెనే బలం ఏంటో తెలిసేది అని ఒకరు, కేసుల భయం తో సీఎం కేసీఆర్ మరియు మోడీ ల కాళ్ళు పట్టుకోవడం పట్ల విమర్శలు గుప్పించారు. 60 ఎంటి రెడ్డి 18 ఏళ్ల వారి నుండి ఓటేయాలని అంటున్నాం అని, టీడీపీ బతుకదు అని అన్న పంచరెడ్డి బతుకాగి 11 ఏళ్లు అయింది అని, మీ పాలిట మేము రాక్షసులమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పలువురు మాత్రం టీడీపీ పై విమర్శలు చేస్తున్నారు.