అచ్చెం నాయుడు కి బాగా తెలుసు టీడీపీ అధికారంలోకి రాదని

Wednesday, December 23rd, 2020, 12:18:33 PM IST

Ycp-mp-Vijayasai-reddy

ప్రతి పక్ష పార్టీ టీడీపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు పై అధికార పార్టీ వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అచ్చెమ్ నాయుడు సవాళ్ళను చూస్తుంటే తెలుగు దేశం పార్టీ లో ఉండేలా లేడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం లోకి వచ్చాక ఏ ఒక్కరినీ వదలం అంటున్నాడు అని విమర్శించారు. అయితే అచ్చెన్నాయుడు కి బాగా తెలుసు టీడీపీ అధికారం లోకి రాదు అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

అయితే మరొక పోస్ట్ లో అధినేత చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు వెళ్దాం అని చంద్రబాబు నాయుడుసవాలు చేశాడు అని గుర్తు చేశారు. మంగళగిరి లో కొడుకు ను ఓడగొట్టుకున్న చంద్రబాబు కి ఈ సారి కుప్పం కూడా గోవిందా గోవిందా అంటూ విజయసాయి రెడ్డి సెటైర్స్ వేశారు. కావాలంటే తన ఎమ్మెల్యే ల అందరి తో రాజీనామా చేసి రెడీ కావాలి అంటూ వ్యాఖ్యానించారు. అయితే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. వైసీపీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.