ఆ మాటకే కట్టుబడి ఉండు అచ్చెన్నా – విజయసాయి రెడ్డి

Wednesday, May 5th, 2021, 12:22:41 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇటీవల జరిగిన తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక లో అధికార పార్టీ వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి విజయభేరి మోగించారు. అయితే ప్రతి పక్ష పార్టీ నేతలు మాత్రం వరుస పరాజయాలను మూటగట్టుకుంటూనే వస్తున్నారు. అయితే తాజాగా మరొకసారి విపక్షాల పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ప్రసన్నం కోసం అచ్చెన్న మరీ దిగజారి డప్పు వాయిస్తున్నాడు అంటూ విమర్శించారు. అగౌరవంగా వాడు సరిగ్గా ఉంటే పార్టీకి ఈ గతి ఎందుకు పడుతుంది అనడాన్ని చిట్టి నాయుడు సీరియస్ గా తీసుకుంటాడేమో అని టెన్షన్ పడుతున్నట్టుంది అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ ఉండదు, బొక్కా ఉండదని ఉన్నమాటే అన్నావ్ అని అన్నారు. అయితే ఆ మాటకే కట్టుబడి ఉండు అచ్చెన్నా అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

అంతేకాక మరొక ట్వీట్ లో తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక ఫలితం గురించి ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్ధి కులం పై అనుమానాలు వ్యక్తం చేశారు అంటూ చెప్పుకొచ్చారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు చేశారు అంటూ ప్రతి పక్ష పార్టీ ల పై సంచలన ఆరోపణలు చేశారు. అయితే రెండేళ్లు గడిచినా సీఎం జగన్ గారిపై ప్రజల విశ్వాసం పెరిగిందే తప్ప తగ్గలేదని గురుమూర్తి గారి మెజారిటీ స్పష్టం చేసింది అంటూ చెప్పుకొచ్చారు.పరాజయం మూటగట్టుకున్న పార్టీలు ఇప్పుడు ఏమంటాయో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.